వైయస్సార్‌సిపిలో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరిక

ఇటిక్యాల (మహబూబ్‌నగర్) 2012 ఆగస్టు 23: మహబూబ్‌నగర్ జిల్లాలో వైయస్సార్­సీపీలోకి గురువారం తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరారు. వైయస్సార్­సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, సీఈసీ సభ్యులు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామరెడ్డి తదితరులు వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటిక్యాల తాజా మాజీ ఎంపీపీ జి. గుర్నాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ, సింగిల్‌విండో చైర్మన్ మాణిక్యరెడ్డితో పాటు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, మరో 16 మంది సర్పంచ్‌లతో సహా మూడువేల మంది కార్యకర్తలు పార్టీలో చేరిన వారిలో వున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి సంక్షేమపథకాల అమలు కేవలం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని, అందుకే ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరామన్నారు. అంతముందు వారు ఎర్రవల్లి చౌరస్తా నుంచి బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Back to Top