యువత కేరింతల నడుమ ప్లీనరీకి భారీ ర్యాలీ

–నకరికల్లు నుంచి కొండమోడు వరకు కొనసాగిన ద్విచక్రవాహన ర్యాలీ
–అభిమానులు, కార్యకర్తల కేరింతలతో ఉవ్వెత్తున పొంగిన నూతనోత్సాహం

నకరికల్లుః ప్రజల్లో వైయస్సార్‌ సీపీకి లభిస్తున్న ఆదరాభిమానాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత రానున్న ఎన్నికల్లో వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమవుతుందని వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్‌ భవనం రాఘవరెడ్డి చెప్పారు. రాజుపాలెం మండలం కొండమోడులో నిర్వహించిన ప్లీనరీ సమావేశానికి భవనం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని కార్యకర్తలు శనివారం భారీగా తరలివెళ్లారు. పార్టీజెండాలు చేతబట్టి ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. జగన్నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, నిరుద్యోగులు, యువత, బడుగుబలహీనవర్గాల్లో పార్టీపట్ల విశ్వాసం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్న తీరుకు ప్రజలు ఆకర్షిలవుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసి సభ్యురాలు రమావత్‌ సామ్రాజ్యంబాయి, సొసైటీ అధ్యక్షుడు దొండేటి కోటిరెడ్డి, మైనారిటీ సెల్‌ కన్వీనర్‌ షేక్‌. మస్తాన్‌వలి, యూత్‌ అధ్యక్షుడు దూదేకుల బాషా, బీసి సెల్‌ కన్వీనర్‌ కోనంకి ఆదినారాయణ, మండల అధికార ప్రతినిధి కొణతం రామాంజిరెడ్డి, ఎస్టీసెల్‌ కన్వీనర్‌ మేడా రాంబాబు, వంగా రాజారెడ్డి, సర్పంచ్‌ మేడం ప్రవీణ్‌కూమార్‌రెడ్డి, ఎంపీటీసి ఆవుల పిచ్చిరెడ్డి, చల్లా గోవిందు, డాక్టర్‌ హుస్సేన్, శాగం చంద్రశేఖర్‌రెడ్డి, గంగిరెడ్డి హుస్సేన్‌రెడ్డి, గోగా యల్లమంద, సూదులగుంట్ల బ్రహ్మానందం, దేవరశెట్టి శ్రీనివాసరావు, కావేటి రామారావు, వడ్రా చిన్న, పలుగ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధసంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు.
Back to Top