అసలు సినిమా ఏపీలో చూపించాలితెలంగాణ ఎన్నికలు చంద్రబాబుకు ట్రైలర్‌ మాత్రమే...
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా..
గుంటూరుః తెలంగాణ ఎన్నికలు చంద్రబాబుకు ట్రైలర్‌ లాంటిదని అసలు సినిమా ఏపీలో చూపించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.గుంటూరులో జరుగుతున్న  వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు లాంటి రాజకీయ నేరగాళ్లను సాగనంపాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా మోసం చేసి పబ్బం గడిపే నేరస్తులను క్షమించకూడదన్నారు. ఇటువంటి వారి చేతుల్లో పడితే  భగవంతుడు  కూడా కాపాడలేడన్నారు. మనీ, తన పచ్చమీడియాతో మీడియాతో  క్రియేట్‌ చేస్తూ అధికారంలోకి చంద్రబాబు వచ్చారని, అది చెల్లదని తెలంగాణ ఎన్నికలతో ప్రజలు తెలుసుకున్నారన్నారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలు ఉన్న ప్రాంతాలు అత్యధిక మెజార్టీతో టీడీపీ,కాంగ్రెస్‌లను ఓడించారంటే అది ట్రయిల్‌ మాత్రమే..సినిమాను ఏపీలో చూపించాలన్నారు. ఎన్టీఆర్‌కు  వెన్నుపోటు నుంచి వైయస్‌ జగన్‌ను అంతమొందించాలనే ప్రయత్నాలకు లెక్క అప్పజెప్పాలని, లేకపోతే లావయిపోతామని ఛలోక్తులు విసిరారు.  చంద్రబాబు నాయుడుతో  ఎన్నికలకు వెళ్లడం కుక్కతొక్క పట్టుకుని గోదారి ఈతడం అని ఇప్పటికే కాంగ్రెస్‌ వాళ్లకు అర్థమయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులు సాగవన్నారు. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమన్వయంతో వైయస్‌ఆర్‌సీపీ పార్టీ విజయానికి కృషిచేయాలన్నారు.. కష్టపడి పని చేసేవాళ్లకు పార్టీలో సముచితస్థానం ఉందన్నారు..పదవుల కోసం పనిచెయొద్దని పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు.ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలన్నారు.
 
Attachments area

తాజా వీడియోలు

Back to Top