రాజులకు పట్టాభిషేకం లాగే జననేతకు పట్టం

పశ్చిమగోదావరి: తండ్రికి తగ్గ తనయుడిగా కాదు.. తండ్రిని మించిన తనయుడిగా వైయస్‌ జగన్‌ పరిపాలన అందిస్తాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉమాబాల అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడుగు, బలహీనవర్గాల అభ్యర్థి మేకా శేషుబాబు గెలుపుకు కృషి చేశారన్నారు. రాష్ట్రంలో అత్యథిక జనాభా గల బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థులు ఎవరైనా వారికి గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గతంలో యువరాజులకు రాజ్యాన్ని తిరిగి వచ్చాకే పట్టం కట్టేవారని, గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి పాదయాత్ర చేసిన అనంతరం పట్టం కట్టారని, ప్రస్తుతం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా అలాగే ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారన్నారు.
Back to Top