పారిశుధ్య కార్మికుల‌కు మ‌ద్ద‌తుగుంటూరు) పారిశుధ్య కార్మికుల కు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్‌సీపీ అండ‌గా నిలుస్తుద‌ని పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల న్యాయ‌మైన కోర్కెల‌ను తీర్చ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న అన్నారు. న్యాయ‌బ‌ద్ద‌మైన ఈ పోరాటానికి అండ‌గా ఉంటామ‌ని ఆయ‌న అన్నారు. ఈ మేరకు మునిసిప‌ల్ వ‌ర్కర్స్ జేఏసీ నాయ‌కులు వ‌రిక‌ల్లు ర‌వికుమార్‌, రంగ‌నాయ‌కులు, ఎస్‌. శంక‌ర్ రావు, మ‌ధుబాబు పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ను క‌లిసి విన‌తి ప‌త్రం అందించారు. క‌నీస అవ‌స‌రాల కోసం 10 రోజులుగా స‌మ్మె చేస్తున్నా, ప్ర‌భుత్వం స్పందించ‌టం లేద‌ని వారు వాపోయారు. ఈ స‌మావేశంలో పార్టీ ట్రేడ్ యూనియ‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు గౌత‌మ్ రెడ్డి, పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్ల పై స్పందించిన వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. కార్మికుల పోరాటానికి మ‌ద్ద‌తుగా ఉంటామ‌న్నారు. త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోయే రాష్ట్ర వ్యాప్త బంద్ కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. 
Back to Top