అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ పోరుబాట...


ఈ నెల 22,23 తేదీల్లో మండల కేంద్రాల్లో రిలే దీక్షలు..
వైయస్‌ఆర్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి..

విజయవాడః అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ప్రభుత్వంపై అమీతుమీ తేల్చుకోవడానికి వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వంపై వైయస్‌ఆర్‌సీపీ సమర శంఖారావం పూరించబోతుందన్నారు.వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా సమావేశం జరగబోతుందని తెలిసి చంద్రబాబు హడావుడిగా సచివాలయంలో సమీక్ష చేస్తున్నారని తెలిపారు  ఈ నెల 22,23 తేదీల్లో  మండల కేంద్రాల్లో అగ్రిగోల్డ్‌ బాధితులతో రిలే దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు  ఈనెల 30న జిల్లా కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 















 

Back to Top