పోలవరం ప్రాజెక్టులో విచ్చలవిడి అవినీతి

ఎన్నికల సొమ్మును పోలవరంలో పిండేస్తున్నారు..
కాంగ్రెస్,టీడీపీలది అపవిత్ర కలయిక
వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు
విశాఖః పోలవర ప్రాజెక్టు చంద్రబాబుకు కల్పవృక్షంగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును  తమ రాజకీయ అవసరాలు కోసం వాడుకుంటూ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇష్టారాజ్యంగా  కాంట్రాక్టర్లను మారుస్తూ వారి నుంచి ముడుపులు వసూళ్లు చేస్తున్నారన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ పోలవరం పనుల నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారని గుర్తుచేశారు. అవినీతిని కప్పిపుచ్చడానికి అద్భుతం జరిగిపోతున్నట్లు  ఆర్భాటంగా ప్రచారాలు చేస్తున్నారన్నారు.  గ్యాలరీ వాక్‌లు పేరుతో ఆయన కుటుంబసభ్యులను, కార్యకర్తలను రాష్ట్ర నలుమూలల నుంచి తీర్థయాత్రలా బస్సులు పెట్టి తరలించి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తున్నారన్నారు. కేంద్రపభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకుని నిధులను స్వాహాచేస్తున్నారన్నారు.  ఎన్నికలకు కావాల్సిన సొమ్మునంతా ప్రాజెక్టులో పిండేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం నిర్మాణం పూర్తియితే తప్ప ఎన్నికల్లో ఓట్లు అడగనని చంద్రబాబు చెప్పారని, . నేడు గ్యాలరి మీద ఆయన మనవడిని నడిపించి ఓట్లు అడుగుతున్నారన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడం కోసం కొత్తకొత్త ఎత్తులు వేస్తున్నారన్నారు. చిత్తశుద్ధితో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కుటుంబసభ్యులతో నడిపించి షోలు  చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్,టీడీపీలది అపవిత్ర కలయికః
కాంగ్రెస్,టీడీపీలది అపవిత్ర కలయిక అని అంబటి అన్నారు. పొత్తులు పెట్టుకోవడం తప్పకాదని, పొతుల్లో నెత్తిక విలువలు ఉండాలన్నారు.కాంగ్రెస్‌తో ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ కలుస్తుందని ఎప్పడైనా ఊహించారా అంటూ టీడీపీ కార్యకర్తలను ప్రశ్నించారు. ఎవరితోనైనా కలుస్తారని ఉపయోగించుకున్న తర్వాత ఎవరినైనా వదిలేయడం  చంద్రబాబు సిద్ధాంతం అని విమర్శించారు.ు  రాజకీయ  ఊసరవెల్లి చంద్రబాబు అని తెలుగు ప్రజలు గమనించాలని,  ఇటువంటి రాజకీయ నాయకుడిని చ్రరితలో తిరస్కరించాలన్నారు. 
Back to Top