చంద్రబాబు లేఖపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి

బలహీనవర్గాల జడ్జి అభ్యర్థుల అవకాశాలకు గండికొడతారా?
కుల వివక్షతతో తప్పుడు లేఖ రాస్తే సీఎం పదవి నుంచి తొలగించాలి
జస్టిస్‌ ఈశ్వరయ్య లేఖపై చంద్రబాబు సమాధానం చెప్పాలి
సంక్షేమం నా హక్కు అనేలా వైయస్‌ఆర్‌ పాలన 
సంక్షేమాలకు గండికొట్టే విధంగా చంద్రబాబు పాలన
విజయవాడ: జడ్జి నియామకాల్లో బలహీనవర్గాల అభ్యర్థులపై చంద్రబాబు రాసిన లేఖపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు కుల వివక్షతతో బలహీనవర్గాల అవకాశాలను గండికొడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబు పాలనపై బలహీనవర్గాలు రగిలిపోతున్నాయన్నారు. బలహీనవర్గాలకు చంద్రబాబు చెప్పే మాటలన్నీ నేతి బీరకాయలో నెయ్యి లాంటిదని జస్టిస్‌ ఈశ్వరయ్య రాసిన లేఖ ద్వారా స్పష్టమైందన్నారు. జస్టిస్‌ ఈశ్వరయ్య లేఖలో రాసినవి వాస్తవాలా..? కదా..? చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తొమ్మిది జడ్జిలను చేశాం అని చెప్పుకుంటున్నారని, ఎవరి అబ్బ సొత్తు బలహీనవర్గాలకు ఇవ్వలేదని వారి స్వశక్తితో ఎదిగారన్నారు. 
ఏ పార్టీ దయతో రాదని గుర్తుపెట్టుకోవాలి..
జడ్జిల నియామకాలు ఒక పార్టీ దయతో రావనేది చంద్రబాబు, యనమల రామకృష్ణుడు గుర్తుంచుకోవాలని సూచించారు. చంద్రబాబు లేఖపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని, ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు వ్యవహరించి ఉంటే కేంద్రం ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన చంద్రబాబు కుల వివక్షతతో ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన బలహీనవర్గాల జడ్జి అభ్యర్థుల అవకాశాలకు గండికొట్టి ఉంటే పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ విషయంలో వెంటనే ఎంక్వైరీ వేసి తప్పుడు నివేదికలు ఇచ్చిన వారు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని కోరారు. 
జన్మభూమి కమిటీల పేరుతో వ్యవస్థల చేతులు కట్టేశారు..
ప్రభుత్వ సంక్షేమాలు పొందడం నా హక్కు అనే విధంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలకు భరోసా కల్పించారని పార్థసారధి గుర్తు చేశారు. బలహీనవర్గాలు రాజకీయ నేతల చేతుల్లో బందీలు, బానిసలుగా ఉండకూడదనే ఉద్దేÔ¶ ంతో వైయస్‌ఆర్‌ పనిచేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులకు సంక్షేమాలు అందకుండా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి వ్యవస్థల చేతులు కట్టేశాడన్నారు. చంద్రబాబు పథకాలు ఏ వర్గానికి అందాయో ప్రభుత్వానికి దమ్ముంటూ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యవసాయ పనిమూట్లు, ట్రాక్టర్లు తెలుగుదేశం పార్టీలో ఒక వర్గానికి మాత్రమే దక్కాయని, అవి కూడా నిరూపిస్తామన్నారు. బలహీనవర్గాలు ఉన్నస్థాయికి ఎదగాలనే వైయస్‌ఆర్‌ ముందుచూపుతో ఫీజురియంబర్స్‌మెంట్‌ పెట్టి వారిని డాక్టర్లు, ఇంజినీర్లుగా తీర్చిదిద్దారన్నారు. కానీ చంద్రబాబు ఇప్పుడు ఆ పథకానికి కూడా గండికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే టీడీపీ ప్రభుత్వానికి బలహీనవర్గాలపై ఎంత ప్రేమ ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలని సూచించారు. 
 

తాజా వీడియోలు

Back to Top