అనారోగ్యంతో వైయస్సార్సీపీ సీనియర్‌ నాయకుడి మృతి

గుంతకల్లు రూరల్‌:మండల పరిధిలోని వైటీ.చెరువు గ్రామానికి చెందిన వైయస్సార్సీపీ సీనియర్‌ నాయకుడు నాగమల్లన్న (65) ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న వైయస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి సోమవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకొని మృతదేహాన్నిపరామర్శించారు.  నాగమల్లన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైయస్సార్సీపీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు నక్కా భీమలింగప్ప, కిసాన్‌సెల్‌ జిల్లా కార్యదర్శి సోమిరెడ్డి, ఖలీఫా, స్థానిక నాయకులు జయ్యన్న, పక్కీరప్ప తదితర నాయకులు ఆయన వెంటున్నారు.

Back to Top