2019 జగన్‌ సునామీ రాబోతుంది

2004 మహానేత సీన్‌ మళ్లీ రిపీట్‌ అవుతుంది
వైయస్‌ జగన్‌పైనే నమ్మకంతో లక్షలాది మంది మద్దతు
రాజన్న రాజ్యం కోసం ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు
చంద్రబాబు చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
జాతీయ అవార్డులు తీసుకున్న జిల్లాను వలసల జిల్లాగా మార్చడు
విషజ్వరాలతో 50 మంది చనిపోతే పట్టించుకునే దిక్కే లేదు
విజయనగరం: 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ పెను సునామీ సృష్టిస్తారని, 2004లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సృష్టించిన చరిత్రను తిరగరాస్తాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ గెలిచినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే పవిత్ర లక్ష్యంతో పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలన్నీ తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ వైయస్‌ జగన్‌ చేసిన అడుగు మూడు వేల కిలోమీటర్లు చేరుకుందన్నారు. దేశపాత్రునిపాలెం వద్ద బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు ఏ ఒక్కరూ చంద్రబాబు పాలనతో సంతోషంగా లేరన్నారు. చెప్పిన వాగ్దానాలు ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో కూడా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడన్నారు. బాబు పాలనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వైయస్‌ జగన్‌పై నమ్మకం పెట్టుకున్న ప్రజానీకం లక్షలాదిగా పాదయాత్రకు మద్దతు పలుకుతున్నారన్నారు. కష్టాలు తీరాలంటే మళ్లీ వైయస్‌ఆర్‌ పాలన రావాలని, వైయస్‌ జగన్‌ వల్లే అది సాధ్యమని కోటి ఆశలతో ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. 

దేశంలోనే రాజకీయాలంటే నమ్మకం తీసుకొచ్చిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అని బొత్స గుర్తు చేశారు. ఏదైనా మాట చెబితే.. అది నెరవేర్చవారని, మళ్లీ అలాంటి పరిస్థితులు ఆయన తనయుడు వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. పనికి ఉపాధి పథకంలో జాతీయ స్థాయి అవార్డులు తీసుకున్న విజయనగరం జిల్లా బాబు పాలనలో పనులు లేక నిరుపేదలు వలసలు వెళ్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలను విజయనగరం జిల్లా ప్రజలను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న బుందేల్‌ఖాండ్‌ ప్యాకేజీ కింద ముష్టివేసినట్లుగా రూ. 50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఆ డబ్బులు కూడా దేనికి ఖర్చు చేశారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 

విజయనగరం జిల్లాకు గిరిజన యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీ అన్నారు. వాటిల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ హయాంలో తలసరి ఆదాయం పెంచి వలసలు ఆపారని, అక్షరాస్యత పెరిగిందని, జబ్బు వస్తే మన ముఖ్యమంత్రి ఉన్నాడులే అని ధైర్యంగా ఉండేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. విషజ్వరాల బారినపడి 50 మంది సరైన వైద్యం అందక మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ రాష్ట్రంలో పాలకులు ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 

తాజా వీడియోలు

Back to Top