వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో బాబు దిట్ట

హైదరాబాద్‌: చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అని  వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు రాజకీయాల కోసం బాబ్లీ కేసును ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయని, వాటిపై స్టేలు ఎలా తెచ్చుకున్నారని  ప్రశ్నించారు. బాబ్లీ వంటి చిన్న కేసును పట్టుకుని సీఎం రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కోర్టు నోటీసులు వచ్చినప్పుడు ఎవరైనా హాజరు కావాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దేనికైనా వెనుకాడరన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నారు. 
 
Back to Top