హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనీతురుపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కరపత్రం విడుదల చేసింది. టీడీపీ మేనిఫెస్టో లో ఇచ్చిన 20 హామీలపై కరపత్రం ముద్రించింది. ఈసందర్భంగా ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిందేమిటీ, చేసేదేమిటీ..ప్రశ్నిద్దాం..?నిలదీద్దాం..అని కరపత్రంలో పేర్కొంది. విజయయాత్రకు వస్తున్న సీఎం, మంత్రులను ప్రజలు నిలదీయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. <br/>....................................<img src="/filemanager/php/../files/untitled%20folder/2.jpg" style="width:625px;height:787px;vertical-align:middle"/><br/>