జననేతపై హత్యాయత్నం ప్రభుత్వ కుట్రే

విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌సీపీ నేతల ఆందోళన
విజయవాడ: ప్రభుత్వ ప్రమేయంతోనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు వైయస్‌ జగన్‌పై హత్యాయత్నానికి నిరసనగా ఆందోళన చేపట్టారు. చంద్రబాబు డౌన్, డౌన్‌ అంటూ నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల మేలు కోసం పోరాడుతున్న వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా టీడీపీ నేతలు వ్యవహరించారన్నారు. పథకం ప్రకారం జననేతను మట్టుబెట్టేందుకు శ్రీనివాసరావు అనే నిందితుడు హత్యాయత్నం చేశాడని రిపోర్టు వచ్చినా.. సానుభూతి కోసం వైయస్‌ఆర్‌ సీపీ నేతలే చేయించారని టీడీపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. చంద్రబాబు హత్యా రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైయస్‌ జగన్‌కు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top