సరస్వతీ విద్యామందిరం ఆవరణలో వైయస్సార్‌సీపీ ప్లీనరీ

మడకశిర: మడకశిరలోని హిందూపురం రోడ్డులో గల శ్రీ సరస్వతీ విద్యామందిరం ఆవరణంలో జూన్‌8న వైయస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10గంటలకు ప్లీనరీ సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. సాయంత్రం వరకు ఈ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించి వివిధ సమస్యలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఈప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top