శోభానాగిరెడ్డికి ఘన నివాళి అర్పించిన వైఎస్ఆర్ సీపీ నాయకులు

హైదరాబాద్: ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ముఖ్య నేతలు శోభా నాగిరెడ్డికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, పలువురు పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు.

అదే విధంగా ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో కూడా శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో నివాళులు అర్పించిన వారిలో మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

శోభానాగిరెడ్డి సొంత జిల్లా కర్నూలులో భారీగా వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి హాజరయ్యారు.

నగరంలోని చాంద్రాయణ గుట్టలో  వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్తానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు  ఆమె చిత్రపటం వద్ద  పుష్ఫ గుచ్ఛలతో నివాళులు అర్పించారు.

తాజా వీడియోలు

Back to Top