వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్..!

హైదరాబాద్ః  వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా  వైఎస్సార్సీపీ నల్లా సూర్యాప్రకాశ్ పేరును ఖరాసు చేసింది. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈమేరకు ప్రకటన చేశారు.  రేపు  వైఎస్సార్సీపీ తరపున నల్లా సూర్యప్రకాశ్ నామినేషన్ దాఖలు చేస్తారు.  నల్లా సూర్యప్రకాశ్ పట్టుదల ఉన్న వ్యక్తని పొంగులేటి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ . రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే..అభ్యర్థి గెలుపుకు కృషిచేస్తాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమపథకాలతోనే ప్రచారం చేపడుతామన్నారు.  తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే..మళ్లీ రాజన్న రాజ్యం రావాలని అంతా కోరుకుంటున్నారని చెప్పారు. నల్లాసూర్యప్రకాశ్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని వరంగల్ ఓటర్లకు పొంగులేటి విజ్ఞప్తి చేశారు. 
Back to Top