రాజ్య‌స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల ఆందోళ‌న‌అమ‌ర‌వీరుల‌కు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో నివాళులు
ఢిల్లీః  విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. పార్లమెంటు ఆవ‌ర‌ణ‌లో గాంధీ విగ్రహం వద్ద వైయస్‌ఆర్‌సీపీ నేలు ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలను కేంద్రం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ రాజ్య‌స‌భ‌లో ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లి పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు, తాజామాజీ ఎంపీలు ఢిల్లీలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. 2001 డిసెంబ‌ర్ 13న పార్ల‌మెంట్‌పై జ‌రిగిన దాడిలో ప్రాణాలు కొల్పోయిన అమ‌రుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు నివాళుల‌ర్పించారు. కాగా.. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, వైయ‌స్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన విష‌యం విధిత‌మే. అలాగే హోదా సాద‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగున్న‌రేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. యువ‌భేరీల‌తో యువ‌త‌ను చైత‌న్య‌వంతం చేశారు. హోదా సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌ద‌ని ఇప్ప‌టికే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో పార్టీ నేత‌లు త‌మ ఆందోళ‌న‌ను పార్ల‌మెంట్లో కొన‌సాగిస్తున్నారు.కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, విజ‌య‌సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

 

తాజా వీడియోలు

Back to Top