లోక్‌సభలో హోరెత్తిన ప్రతిపక్ష ఎంపీల హోదా నినాదం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా సంజీవని అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో నిర్విర్వామంగా పోరాడుతున్నారు. గురువారం వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైయస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దరెడ్డి మిథున్‌రెడ్డిలు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. 
Back to Top