<strong>ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది మహానేత వైయస్‌ఆరే..</strong><strong>ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి</strong> ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు సర్కార్‌పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2009లోనే వైయస్‌ఆర్ శంకుస్థాపన చేశారన్నారు. పరిపాలనా అనుమతులు, రూ.50 కోట్లు నిధులు కేటాయించారన్నారు.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినా ఒక్కపైసా విదల్చలేదన్నారు. నేడు మళ్లీ శంకుస్థాపన డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు..