ఏ రోజుకైనా వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా సాధిస్తారు



–  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైయస్‌ఆర్‌సీపీ పోరాటాలను సహించలేకపోతున్నాయి
– ఆమరణ దీక్ష చేసిన ఎంపీలను తెలుగు ప్రజలు మరిచిపోలేరు
– టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలి
ఢిల్లీ:  వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ నాటికైనా ఏపీకి ప్రత్యేక హోదాను సాధిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్‌లోహీర్‌ ఆసుపత్రి వద్ద విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. డాక్టర్ల సలహా మేరకు దీక్ష చేస్తున్న మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను పోలీసులు బలవంతంగా తరలించారన్నారు. అయితే ఇద్దరు కూడా ఫ్లూయడ్స్‌ ఇవ్వవద్దని వారిస్తున్నారన్నారు. ఆరు రోజులుగా ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షలు చేయడంతో నీరసించిపోయారన్నారు.  ఎంపీలను బలవంతంగా ఆసుపత్రికి తరలించే క్రమంలో తోపులాట జరిగిందన్నారు. అంబులెన్స్‌ను అడ్డుకున్నామన్నారు. అయితే పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారన్నారు. ఏపీ ప్రజల కోసం, ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న ఎంపీలను ఏపీ ప్రజలు మరిచిపోరన్నారు. పదవులను రాజీనామా చేసి దీక్ష చేపట్టడం ఎవరు మరిచిపోరన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైయస్‌ఆర్‌సీపీ పోరాటాలను సహించలేకపోతున్నాయని మండిపడ్డారు. శ్రీకృష్ణ భగవానుడు భగవత్గీతలో చెప్పిన శ్లోకం గుర్తు తెచ్చుకోవాలన్నారు. మనం చేసే పని ఫలాన్ని ఆశించకుండా చేయాలన్నారు. ఎవరి పని వారు నిర్వర్తించాలన్నారు. చంద్రబాబు 30 సార్లు ఢిల్లీకి వచ్చానని, హోదా గురించి పోరాటం చేశానని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఢిల్లీ కంటే ఎక్కువ సార్లు విదేశీ పర్యటనలు చేశారన్నారు. దోచుకున్నది దాచుకునేందుకే ఈయన విదేశాలకు వెళ్లారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఏర్పడిన నాటి నుంచి కూడా సమర శీల పోరాటాలు చేస్తున్నామన్నారు. టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని, మా ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏ రోజుకైనా వైయస్‌జగన్‌ ప్రత్యేక హోదాను సాధిస్తారని దీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఆయన సూచించారు. 
 
Back to Top