స‌క్సెస్‌ఫుల్‌గా సంఘీభావ యాత్ర‌

- నాలుగో రోజు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర‌
- విశాఖ వాడ‌ల్లో రెప‌రెప‌లాడుతున్న వైయ‌స్ఆర్‌సీపీ జెండాలు
- వెల్లువెత్తుతున్న స‌మ‌స్య‌లు
విశాఖ: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో విశాఖలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర నాలుగో రోజుకు చేరింది. శ‌నివారం ఉద‌యం విజ‌య‌సాయిరెడ్డి  పాదయాత్ర ప్రారంభించారు.  విశాఖ‌లోని వీధుల్లో వైయ‌స్ఆర్ సీపీ నేత‌కు  అడుగుడుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. త‌మ స‌మ‌స్య‌లు విజ‌య‌సాయిరెడ్డికి చెప్పుకొని ప్ర‌జ‌లు స్వాంత‌న పొందుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే అభివృద్ధి సాధ్య‌మ‌ని, అందుకు అంద‌రం అండ‌గా ఉంటామ‌ని పేర్కొంటున్నారు. విజ‌య‌సాయిరెడ్డి విశాఖ వీధుల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుసాగుతున్నారు.  
  
ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే
విశాఖ న‌గ‌రంలో నాలుగేళ్లుగా ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయ‌ని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు.  చంద్రబాబు ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు గడిచినా గాజువాక హౌజింగ్‌ కమిటీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఉక్కు నిర్వాసితులకు చంద్రబాబు మొండిచేయి చూపించారని అన్నారు. ఆర్‌ కార్డు హోల్డర్లకు వయోపరిమితి దాటిపోయిందని అన్నారు. వారికి రూ. 50 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసినా.. ఇవాళ్లికి చెల్లించలేదని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ భూముల్లో స్పోర్ట్స్‌ హబ్‌ కడతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అది అడియాసే అయిందని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఆ హామీని నెరవేరుస్తామని చెప్పారు.


Back to Top