ఆయ‌న‌ది కొంగ చేసే దొంగ జపం


 విజయవాడ : చ‌ంద్ర‌బాబు చేసింది ధ‌ర్మ పోరాటం కాద‌ని, కొంగ చేసే దొంగ జ‌పమ‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ రావు విమ‌ర్శించారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.. ‘ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా కాలయాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు దీక్షకు దిగటం హాస్యాస్పదంగా ఉందన్నారు.  మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకే ఆయన ఈ దీక్ష చేపట్టారని అన్నారు.  
వైయ‌స్ఆర్‌సీపీ  వల్లే ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యే హోదా’ అంశంపై ప్రజల్లో చైతన్యం వచ్చిందని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్రంతో కొట్లాడి ప్రత్యేక హోదా సాధించి ఉంటే రాష్ట్రం ఇన్ని అప్పుల్లో కూరుకుపోయేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఒక్కసారి కూడా ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయని బాబు 2019 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. 

తాజా వీడియోలు

Back to Top