పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లేదు – వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
– 73, 74 రాజ్యాంగ సవరణలు చేసి 25 ఏళ్లు గడిచింది
– 25 ఏళ్ల కిందట ఉన్న పంచాయతీలకు ఉన్న అధికారాలు ఇప్పుడు లేవు
హైదరాబాద్‌: రాజ్యాంగంలో ఇచ్చిన అధికారాలు అమలు అయ్యే పరిస్థితి పంచాయతీలకు లేదని, వాటిని రాజ్యాంగ ప్రతిపత్తి లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు, మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో ఆ నాటి అధికారాలు ఎలా ఉండేవి? ప్రభుత్వాలు ఇచ్చిన ప్రోత్సహకాలు ఏంటి? అనేక కమిటీలు వేయడం 1973–1974వ సంవత్సరం రాజ్యాంగ సవరణ తెచ్చారన్నారు. ఇందులో ఉన్న నిబంధనల మేరకు దేశంలోని మొత్తంలో ఉన్న పంచాయతీలకు నిధులు ఏవిధంగా కేటాయించారో చెప్పారన్నారు. పట్టణ్రçపాంతంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిధుల కేటాయింపులు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. రాజ్యాంగ సవరణఅమలైందా? లేదా అన్నది ఒక సారి సమీక్షించుకోవాలన్నారు. 25 ఏళ్ల క్రితం పంచాయతీలకు ఉన్నటువంటి అధికారాలు, వాటికి ఉన్న నిధులు, ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్‌ల వ్యవస్థకు ఉండాల్సిన గౌరవాలు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. విభజిత రాష్ట్రంలో గ్రామ సర్పంచులు అన్న వారిని  ప్రజలు ఎన్నుకున్నారు కానీ, మన రాష్ట్రంలో వారికి స్వాతంత్య్ర ప్రతిపత్తి ఎక్కడ లేదన్నారు.పంచాయతీలకు రాజ్యాంగ హోదా ఇచ్చారన్నారు. రాజ్యాగంలో ఇచ్చిన అధికారాలు ఎక్కడ కనిపించడం లేదని, అమలు చేసే అవకాశాలు లేవన్నారు. అంబుడ్స్‌మెంట్‌ కమిటీ ఎన్ని పంచాయతీలపై విచారణ జరిపారో చెప్పాలన్నారు.బ్రిటీష్‌కాలం నుంచి పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు ప్రాధాన్యత ఉందని చెప్పారు. అంబుడ్స్‌మెంట్‌ కమిటీ లేకపోవడంతో అవినీతి విచ్చలవిడిగా సాగుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ చట్టంలో ఉన్న  29 అధికారాలను కుదించి పది అధికారాలకు చేశారన్నారు. మైనింగ్‌ అంతా కూడా పంచాయతీల చేతిలో ఉండాలన్నారు. ఈ రోజు మైనింగ్‌కు రాష్ట్రంలో అధిక ప్రాధాన్యత ఉందన్నారు. ఇవాళ స్థానిక ప్రభుత్వాలు కునారిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి పర్యవసనంగా గ్రామాల్లో వీధి లైట్లు లేవన్నారు. పారిశుద్ధ చర్యలు అసలే లేవన్నారు. వీటన్నింటిని సక్రమంగా అమలు చేసేందుకు అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. పంచాయతీలకు సంబంధించిన డబ్బు ట్రెజరీలో జమా చేస్తే..వాటిని పొందడానికి సర్పంచ్‌లు అవస్థలు పడుతున్నారన్నారు. ఏపీలో పంచాయతీల అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తు కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు.

తాజా వీడియోలు

Back to Top