నాలుగున్నరేళ్లుగా ఏం ప్రశ్నించావ్‌ పవన్‌..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
విజయనగరంః నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం లక్షల కోట్లు దోచుకుంటున్నా పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే బాక్సైడ్‌ను దోచుకుంటుందని రంపచోడవరం బహిరంగ సభలో పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలను ఖండించారు.చంద్రబాబుకు ఎప్పుడు కష్టమొచ్చినా పవన్‌కల్యాణ్‌ తెర ముందుకొచ్చి ఏదో ఒక హడావుడి చేస్తారన్నారు.చింతపల్లి నిర్వహించిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాక్సైడ్‌ విషయంలో టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారని గుర్తు చేశారు. అనంతరం కొన్ని జీవోలు రద్దు చేయడం జరిగిందన్నారు.బాక్సైడ్‌కు ఎవరైతే అడ్డుగా ఉన్నారో ఎమ్మెల్యేలకు కోట్లు ఇచ్చి ప్రలోభపెట్టి కొనుగోలు చేశారన్నారు.టీడీపీకి చెందినవారే బాక్సైడ్‌ను దోచుకుంటున్నారని, హత్యకు గురైన కిడారి సరేశ్వరరావును బాక్సైడ్‌ దోచుకుంటున్నారే హత్య చేసినట్లు మావోయిస్టులు ప్రకటించారని తెలిపారు.ఇది పవన్‌కు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరపున మీరు ఏ పోరాటాలు చేస్తున్నారని మండిపడ్డారు.గిరిజనులు ప్రభుత్వం సాయం అందక రోడ్డున పడుతుంటే వారిని ఆదుకోవడానికి పవన్‌కల్యాణ్‌ ముందుకు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు.2019లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం పవన్‌కల్యాణ్‌  ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
 
Back to Top