బాబు లాంటి సీఎంను ఎప్పుడు చూడలేదు


గుంటూరు: చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడు చూడలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలోని సమస్యలపై సీఎం చంద్రబాబుకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి బహిరంగ లేఖ రాశారు. మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి సమస్య ఉందని పిన్నెళ్లి పేర్కొన్నారు. 1998లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన వరికపూడిశిల ఎత్తిపోతల పథకానికి మోక్షం ఎప్పుడని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గ సమస్యలపై కలవడానికి అపాయింట్‌మెంట్‌  ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి సీఎంను గతంలో ఎప్పుడు చూడలేదని పిన్నెళ్లి మండిపడ్డారు. 
 

తాజా ఫోటోలు

Back to Top