– చంద్రబాబు పాలనలో దళితులకు ఎక్కడా న్యాయం జరగలేదు– ఏపీలో మహిళలకు రక్షణ కరువు– దళితులపై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం– ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును అరెస్టు చేయాలిహైదరాబాద్: చంద్రబాబు పాలనలో దళితులపై అనేక దాడులు జరిగాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపులతో సహా దొరికిపోయిన చంద్రబాబును వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పరిధిలోని శాకమూరులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చంద్రబాబును నిలదీశారు. పక్క రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో సహ దొరికిపోయిన చంద్రబాబు ఎక్కడ జైలుకు వెళ్తామో అన్న భయంతో దొంగకు తేలు కుట్టినట్లుగా వ్యవహరించారన్నారు. టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందన్నారు.

దళితులుగా ఎవరైనా పుడుతారా అన్న ఏకైక వ్యక్తి చంద్రబాబే అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి నాలుగేళ్లు అవుతున్నా..ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయంపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు మేరుగ నాగార్జున, తదితరులు మౌన దీక్ష చేపడితే వారిని అరెస్టు చేయడం బాధాకరమన్నారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు అధికమయ్యాయన్నారు. గగరుప్రరులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని దళితులను గ్రామ బహిష్కరణచేశారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పశువు చర్మం వలిచారని చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. కుప్పంలో దళిత మహిళను వివస్త్రను చేశారన్నారు. కర్నూలు జిల్లాలో పారిశుధ్య పనులు చేయలేదని గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ప్రకాశం జిల్లాలో దళితుల భూములను ఆక్రమించుకున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా మేయింటెన్ చేస్తున్నారో ఈ ఘటనలే సాక్షమన్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి..ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారని యూటర్న్ తీసుకొని, ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజలు తిరస్కరించిన వారిని చంద్రబాబు అందలమెక్కించారన్నారు. ప్రతిపక్షఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, అందులో నలుగురు వ్యక్తులకు మంత్రిపదవులు ఇవ్వడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవడమే అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలో దళితులపై ఆనేక దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకి దిక్కులేకపోతే ఎవరిని అడగాలని శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోడీకి విదేశీ పర్యటనలపై ఉన్న మోజు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండు చేశారు. మా ఎంపీలు నిబద్ధతతో తమ పదవులకు రాజీనామా చేశారన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే కేంద్రం దిగివచ్చేదన్నారు. టీడీపీ ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు.
కేంద్రంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టించి, మోడీ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన మొనగాడు వైయస్ జగన్ అన్నారు. ప్రత్యేక హోదా వైయస్ జగన్‌తోనే సాధ్యమని శ్రీనివాసులు పేర్కొన్నారు.