10న విశాఖలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం

బ్రాహ్మణుల సమస్యలపై చర్చించనున్న జననేత వైయస్‌ జగన్‌
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి
విశాఖ జిల్లాః విశాఖలో 10న జరగబోయే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా  వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విచ్చేస్తారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడించారు. బ్రాహ్మణులు, అర్చకుల సమస్యల జగన్‌ చర్చిస్తారన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం సూచనలతో ఒక కార్యచరణ రూపొందిస్తామన్నారు.బ్రాహ్మణ సామాజిక వర్గంలోని ప్రముఖులు, అర్చకులు,బ్రాహ్మణ సంఘాలు కలిసి పాదయాత్రలో వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు తెలపాలని విజ్ఞప్తి చేశారు .చంద్రబాబు పాలనలో బ్రాహ్మణుల గోడు పట్టించుకోలేదని విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు సరైన నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించిందన్నారు. రూ.500 కోట్లు ఇస్తామని రూ.125 కోట్ల మాత్రమే ఇచ్చారన్నారు. పురోహితులు,అర్చకులు  చాలా కష్టాల్లో ఉన్నారని అనేక బ్రాహ్మణ కుటుంబాలు చితికిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఐవీఆర్‌ను తొలగించిన విధానం బాధాకరమని,  రమణదీక్షితులు విషయంలోనూ అదే జరిగిందన్నారు. రాజకీయాల్లో బ్రాహ్మణుల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్నారు.వైయస్‌ జగన్‌ నాయకత్వంలో బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుందన్నారు. 


Back to Top