చంద్రబాబు బ్రాహ్మణ ద్వేషి..

బ్రాహ్మణులకు గౌరవం ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దే..
వైయస్‌ఆర్‌సీపీతోనే బ్రాహ్మణులకు న్యాయం..
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి
హైదరాబాద్ః చంద్రబాబు బ్రాహ్మణ ద్వేషి అని వైయస్‌ఆర్‌సీపీ  ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు.హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.అగ్రవర్ణమైనా బ్రాహ్మణులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 500 కోట్లు కేటాయిస్తానన్న చంద్రబాబు నాయుడు నాలుగున్నర సంవత్సరాలలో కేవలం రూ. 205 కోట్లు కేటాయించి  170 కోట్లు మాత్రమే వినియోగించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రతి కులానికి ఒకో వాగ్దానం చేస్తూ ప్రలోభాలు చేస్తూ  మేనిఫెస్టో కింద పెద్ద నోటుబుక్‌నే ఇచ్చిందన్నారు.పెద్దలు ఐవీఆర్‌ కృష్ణారావు, బ్రాహ్మణ నాయకులు కృషితో   ఏర్పడిన బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అర్హులకు లబ్ధిచేకూర్చాలనే ఉద్దేశ్యంతో ఐవీఆర్‌ వంటి బ్రాహ్మణ పెద్దలు ఎంత ప్రయత్నించారన్నారు. దానికి ప్రతిఫలంగా వారిని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రాహ్మణులు ఎవరు మరిచిపోలేరన్నారు. బ్రాహ్మణుల ఆశలు  అడియాశలు  చేస్తూ బ్రాహ్మణులందరూ బాధపడే విధంగా ఐవిఆర్‌కు జరిగిన అవమానం మరిచిపోలేమన్నారు. తొలగింపు విధానం చాలా అభ్యంతరకరమన్నారు. అలాగే రమణ దీక్షితులు  వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.ఆలయానికి సంబంధించి వంశపారపర్యంగా  వస్తున్న ఒక ప్రధాన అర్చకుడు హోదాలో ఉంటూ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కొత్త పాలక మండలిలోనే ఆయనను తొలగించడం దారుణం అన్నారు. రమణ దీక్షితులు ఆరోపణలపై ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. నేడు రాజకీయంగా కాని, అన్ని రకాలుగా బ్రాహ్మణ ద్వేషిగా ఉన్న చంద్రబాబు నాయుడిని  గద్దె దించాలన్నారు. 

చంద్రబాబు నాయుడు వైయస్‌ఆర్‌ కుటుంబం గురించి అనేక రకాలుగా అనేక సందర్బాల్లో పుకారులు పుట్టించి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. క్రైస్తవ మతంపై నమ్మకాని వైయస్‌ఆర్‌ కుటుంబం ఎప్పుడు దాచిపెట్టుకోలేదన్నారు. ఇతర మతాలను ఆదరించిన కుటుంబం వైయస్‌ఆర్‌ కుటుంబం అని అన్నారు. బ్రాహ్మణులకు వైయస్‌ఆర్‌ హయాంలో ప్రత్యేక గౌరవం ఇచ్చారన్నారు. రాజకీయ అవకాశాలు ఇచ్చారన్నారు.  ఇది బ్రాహ్మణ జాతి మరిచిపోకూడదన్నారు.  రాబోయే రోజుల్లో బ్రాహ్మణులకు మరింత ప్రాతినిధ్యం కల్పిస్తానని వైయస్‌ జగన్‌ తెలిపారన్నారు.  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  బ్రాహ్మణ సమస్యలను పరిష్కారానికి ఎంతో తాపత్రాయం పడుతున్నారన్నారు. వారి జాతి గురించి తప్ప వేరే జాతి గురించి ఆలోచించని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జీవో 76ను అధికారంలోకి వచ్చిన వెంటన అమలు చేస్తామన్నారు. 1000 కోట్ల బ్రాహ్మణ కార్పొరేషన్‌తో  బ్రాహ్మణ సమస్యలు పరిష్కారిస్తామన్నారు. 

వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బ్రాహ్మణులు అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మల్లాది విష్ణు,నేను కన్వీనర్లగా, బ్రాహ్మణ నాయకులు  సభ్యులుగా బ్రాహ్మణ అధ్యయన కమిటీని వేయడం కూడా శుభ సూచికమన్నారు. బ్రాహ్మణులపై తన చిత్తశుద్ధిని జగన్‌మోహన్‌ రెడ్డి చాటుకున్నారన్నారు.అధ్యయనం ద్వారా  బ్రాహ్మణ కార్పొరేషన్‌ పటిష్టం చేస్తామన్నారు.  బ్రాహ్మణ సమస్యలపై  లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు.

తాజా వీడియోలు

Back to Top