ఇద్దరు నాయుళ్లు కలిసి రాష్ట్రాన్ని ముంచారు

సీఎం రమేష్, సుజనాచౌదరిలకు సిగ్గు, లజ్జ లేదు
వంద చంద్రబాబులు అడ్డుపడ్డా వైయస్‌ జగనే సీఎం
ఢిల్లీ: కేంద్రంలో ఒక నాయుడు, రాష్ట్రంలో ఒక నాయుడు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి రెహ్మాన్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద చేస్తున్న ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... రాష్ట్రంలో సైకిల్‌కు హ్యాండిల్‌ లేని, కేంద్రంలో మంత్రులుగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, సుజనాచౌదరిలకు సిగ్గు, లజ్జ లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతుంటే వారు మాత్రం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడైన చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, వంద చంద్రబాబులు వచ్చినా దాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే బీజేపీకి ఏపీలో బతుకు ఉంటుందని, లేకపోతే టీడీపీ, బీజేపీలకు ప్రజలు సమాధి కడుతారన్నారు. 
Back to Top