వివాహ వేడుకలకు వైయస్సార్‌సీపీ నాయకులు హాజరు

పుట్టపర్తి అర్బన్‌ః మండల పరిధిలోని బొంతలపల్లి గ్రామానికి చెందిన వైయస్సార్‌సీపీ నాయకులు నరసింహులు కుమారుడు బాలచంద్ర వివాహానికి పలువురు వైయస్సార్‌సీపీ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం గ్రామంలో జరిగిన బాలచంద్ర వివాహానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్‌ కేశవరెడ్డి, సీనియర్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ సూర్యనారాయణ, ఆదినారాయణ, ఓబుళప్ప, వెంకటేసు, రామాంజినేయులు, రఫి, కుళ్లాయిరెడ్డి, మధు, హరి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో వీధుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. తాగునీటి సమస్య తెలత్తితే ఫోన్‌ చేస్తే ట్యాంకు పంపుతామని హామీ ఇచ్చారు. 

Back to Top