పార్టీ కార్యాలయంలో మహానేతకు నివాళి


()ప్రియతమ నేతకు నివాళులు
()విస్తృతంగా సేవా కార్యక్రమాలు

హైదరాబాద్ః  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 7వ వ‌ర్ధంతిని పురస్కరించుకొని  లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్సీపీ నేతలు మహానేత  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వైయస్ఆర్ తో తమ అనుభవాలను, ఆయన పరిపాలన దక్షతను గుర్తుచేసుకున్నారు. దీంతో పాటు,  పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, అంధులకు  చీరలు, దుప్పట్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు. వైయస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, బుట్టా రేణుక, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైయస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, వాసిరెడ్డి పద్మ, నాయకులు, కార్యకర్తలు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. 
  


Back to Top