కృష్ణాడెల్టాలో వైఎస్సార్సీపీ నేతల పర్యటన..!

ఎండిన పంటలతో రైతన్న విలవిల..
తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్...!

గుంటూరుః కృష్ణా డెల్టాలో ఎండిపోయిన పంటపొలాలను గుంటూరు వైఎస్సార్సీపీ నాయకులు పరిశీలించారు. పంటలు ఎండిపోయి రైతులు విలవిలలాడుతుంటే ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని నేతలు మండిపడ్డారు. నధుల అనుసంధానం పూర్తిచేశానని , పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు నీళ్లి తెస్తానని చెప్పి.....చంద్రబాబు రైతులను నమ్మించి మోసం చేశారన్నారు. ఎకరాకు 20 నుంచి 25 వేలు ముందుగానే కౌలు చెల్లించి..మరో 15 వేలు పెట్టుబడి పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

కళ్లముందే ఎండుతున్నపంటలు చూసి రైతులు ఆత్మహత్యలే శరణ్యమంటుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు తీసుకొచ్చేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని,  రైతులు ఎవరూ అధైర్యపడొద్దని మనోధైర్యం కల్పించినట్లు వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంతో పాటు..ఆరుతడి పంటలకు నీళ్లు ఇచ్చే సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మారెడ్డి, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, నాగిరెడ్డి తదితర నేతలు పంటలు ఎండిన ప్రాంతాల్లో పర్యటించారు. 
Back to Top