హోదా తెస్తారో లేదో చెప్పండి..!

గుంటూరుః జననేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాపై చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తుంటే ..ప్రభుత్వం మాత్రం అణిచివేత ధోరణి ప్రదర్శిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఇద్దరూ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెస్తారో లేదో చెప్పాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. స్పెషల్ స్టేటస్ కోసం వైఎస్ జగన్ ఈనెల 26 నుంచి గుంటూరులో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్ష నేపథ్యంలో స్థలం ఎంపిక కోసం నేతలు సమాలోచనలు జరిపారు. అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు ఆర్కే,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఈంసదర్భంగా మాట్లాడుతూ వారు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు భరోసాయాత్రలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతులకు క్షమాపణ చెప్పాకే యాత్రకు వెళ్లాలన్నారు. రిషితేశ్వరి మృతికి కారణమైన ప్రిన్సిపల్ బాబురావుపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. ఇందుకు బాధ్యతగా మంత్రి నారాయణను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.  

తాజా వీడియోలు

Back to Top