వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్‌ వర్ధంతి


హైదరాబాద్‌:  దళితుల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఆయన సేవలను స్మరించుకుంది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి.. నేతలు నివాళులర్పించారు.  ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ మనకు భగవద్గీతలాంటి రాజ్యాంగాన్ని ప్రసాదించారని అన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తిని సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసి.. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకొని.. పార్టీ మారిన సభ్యులపై ఏపీ, లోక్‌సభ స్పీకర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మూడేళ్లైనా ఏపీ రాజధాని అమరావతిలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయలేదని వైవీ సుబ్బారెడ్డి తప్పుబట్టారు. రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు.


Back to Top