రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన వైయ‌స్ఆర్‌ సీపీ నేతల బృందం



 న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను వైయ‌స్ఆర్‌ సీపీ  నేతల బృందం సోమ‌వారం ఉద‌యం కలిసింది. వైయ‌స్ఆర్‌ సీపీ  అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినపత్రాన్ని ఆయనకు ఇచ్చారు. అంతేకాకుండా తిత్లీ తుపాను బాధితులకు కూడా సహాయం అందించాలని కోరారు. ఆ బృందంలో వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్త సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, వరప్రసాద్‌ ఉన్నారు. 


ఆపరేషన్‌ గరుడ వెనుక ఎవరున్నారు?
ఆపరేషన్‌ గరుడ వెనుక ఎవరున్నారు.. ఎవరు చేయిస్తున్నారు.. ఏ విధంగా పథకం ప్రకారం ఇవన్నీ చేస్తున్నారో విచారణ చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు కోరారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు మీడియాతో మాట్లాడుతూ..ఈ నెల 25వ తేదీన వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం గురించి వివరించటం జరిగిందని తెలిపారు. సంఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును ఆయనకు వివరించామన్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ సాను కూలంగా స్పందించి కేసును పరిశీలిస్తానని, కేంద్రం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయపడుతుందన్నారని చెప్పారు. వైయ‌స్‌ జగన్‌కు తగినంత భద్రత కల్పించాలని కోరినట్లు తెలిపారు. శ్రీకాకుళం తిత్లీ తుఫాను బాధితులకు కేంద్రం సహాయం చేయాలని కోరినట్లు తెలిపారు. 




తాజా వీడియోలు

Back to Top