టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది..

వైయస్‌ఆర్‌సీపీ నేతలు...
విజయనగరంః తిత్లీ తుపాన్‌ ప్రభావంతో కురుపాం నియోజకవర్గం ప్రజలు అంధకారంలోకి వెళ్ళిపోయారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అన్నారు.హుదూద్‌ తుపాన్‌ పరిహారం కంటితుడుపు చర్యగా కేవలం 2వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, తిత్లీ తుపాన్‌తో మరింత నష్టంలోకి ప్రజలు వెళ్ళిపోయారన్నారు.అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు.హుదూద్‌ తుపాన్‌ ప్రభావాన్ని తట్టుకుని బయటపడతామనే ప్రజలకు తిత్లీ తుపాన్‌ రూపంలో ప్రజలను మరింత కష్టాలోకి నెట్టిందన్నారు. గిరిజన ప్రాంతం ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకి అండగా ఉన్నారనే కక్షసాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. వైయస్‌ జగన్‌ దృష్టికి నియోజకవర్గ సమస్యలు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.
 
Back to Top