ప్రత్యేకహోదా వచ్చేదాకా పోరాడుతాం..!

తిరుపతిః ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రిలేదీక్షల్లో పొల్గొన్నారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ రావు మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేంద్రంలో మంత్రులను ఉపసంహరించుకోవాలని ఎంపీ పాలకపక్షాన్ని డిమాండ్ చేశారు.  

ప్రత్యేకహోదా కోసం  తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిశారని, ధర్నాలు, బంద్ లు చేపట్టారన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి నిరవధిక నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వాలు నిమ్ముకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్లమెంట్లో ఆంధ్రులకిచ్చిన వాగ్ధానం నెరవేర్చేవరకు పోరాడుతామన్నారు. యువకులు, రాష్ట్రాభివృద్ధి కోసం యువనాయకుడు వైఎస్ జగన్ దీక్ష చేపట్టారన్నారు. ప్రభుత్వ పథకాలు, పట్టిసీమ సహా టీడీపీ నేతలు చేసే పనులన్నీ అవినీతమయమని దుయ్యబట్టారు.

రాజధాని నిర్మాణానికి తాము అడ్డుకాదని...రాజధాని పేరుతో అక్కడ ప్రభుత్వం చేస్తున్న విధానానికి వ్యతిరేకమని వరప్రసాద్ రావు అన్నారు. అక్కడున్న రైతులను కాపాడమని అడుగుతున్నామని, కూలీలకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. వేలాది ఎకరాలు రైతుల వద్ద లాక్కొని విదేశీయులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.  3 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ సెక్రటేరియట్ తో 60 సంవత్సరాలు నడిపించిన్నప్పుడు...మూడు పంటలు పండే 33 వేల ఎకరాలు తీసుకోవడం దేనికని ప్రశ్నించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top