<br/><br/> న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో తమ ఆందోళన కొనసాగించారు. మంగళవారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్లకార్డులు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు గత పార్లమెంట్ సమావేశాల అనంతరం తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం విధితమే. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నారు. హోదా సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా పోరాటం కొనసాగిస్తున్నారు. <br/>