కేంద్రంపై పోరాటం చేసే దమ్ముందా బాబూ?

– టీడీపీ, బీజేపీ రాష్ట్ర ప్రజలను మోసం చేశాయి
– హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌సీపీ
– ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నది మేమే
–  టీడీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది
– వైయస్‌ జగన్‌పై విమర్శలు చేసే హక్కు టీడీపీ నేతలకు లేదు
 విజయవాడ: విభజన చట్టంలోని హామీలు అమలు చేయకపోతే ఎన్‌డీఏ నుంచి బయటకు వెళ్తామని కేంద్రంతో పోరాటం చేసే దమ్ము, ధైర ్యం ఉందా చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సవాల్‌ విసిరారు. నాలుగేళ్లు ఏపీకి బీజేపీ, టీడీపీలు అన్యాయం చేశాయని, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు మరోమారు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు మండిపడ్డారు. వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు చేస్తున విమర్శలను వారు తిప్పికొట్టారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేసింది ఒక్క వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అన్నారు. వైయస్‌ జగన్‌ ఇందుకోసం రాజీలేని పోరాటం చేశారన్నారు. ఇన్నాళ్లు ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని మాపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా కావాలని ముసలి కన్నీరు కార్చుతున్నారన్నారు.  ఇన్నాళ్లు చంద్రబాబు బీజేపీతో అంటకాగుతూ..ఇప్పుడు చంద్రబాబు ముసలి కన్నీరు కార్చడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రంపై పోరాటం చేస్తారా అని ప్రశ్నించారు. బుద్ధ వెంకన్న ఒంటి నిండా బురద పూసుకొని మాపై విమర్శలు చేస్తున్నారని, ఆయన బు్రర లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బుద్దా వెంకన్న నీకు సిగ్గు ఉందా అని నిలదీశారు. వైయస్‌ జగన్‌ స్క్రీప్ట్‌ సోము వీ్రరాజు మాట్లాడుతున్నారనడం హాస్యాస్పదమన్నారు.  మీరు కేంద్రంతో మిత్రపక్షంగా ఉండి ఇలాంటి విమర్శలు చేయడం ఏంటన్నారు.  వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. ఇప్పటికైనా వైయస్‌ జగన్‌ను ఆదర్శంగా తీసుకోని రాష్ట్ర అభివృద్ధికి తోడుగా రావాలని హితవు పలికారు

టీడీపీ, బీజేపీలు ప్రజలను మోసం చేశాయి: మల్లాది విష్ణు
టీడీపీ, బీజేపీలు ఏపీ ప్రజలను మోసం చేశాయని మల్లాది విష్ణు విమర్శించారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని, అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజల ప్రయోజనాలను కుక్కలు చించిన విస్తరగా చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని ఏకైక పొలిటికల్‌ పార్టీ వైయస్‌ఆర్‌సీపీనే అని,   వైయస్‌ జగన్‌ ఒక్కడే నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఏపీ ప్రజల ఆకాంక్ష మేరకు వైయస్‌ జగన్‌ దారిలో టీడీపీ రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయి ప్రజలను మరోమారు మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. నాలుగేళ్లుగా హోదా ద్వారా వచ్చేది ఏమీ లేదని, ఇవాళ మాట మార్చి మళ్లీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారన్నారు.  ఏపీలో పూర్తిగా అవినీతి చోటు చేసుకుందన్నారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు 1100కు ఫోన్‌ చేయమని చెప్పారన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు పెంచుకొని, కమీషన్లు దక్కలేదని మంత్రులు బరితెగించి వాటాలు వేసుకొని ప్రజా«ధనాన్ని పంచుకుంటున్నారన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య రాజీ కుదిర్చేందుకు ఐఏఎస్‌ అధికారుల సమక్షంలో పంచాయతీలు కుదిర్చారన్నారు. మా ఎంపీ విజయసాయిరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేయడం విడ్డూరమన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు కోరారు. 
 
Back to Top