<br/><br/>కర్నూలుః శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై పోలీసుల జులుం ప్రదర్శించారు. టీడీపీ ప్రభుత్వం పోలీసులతో అరాచకం స్పష్టిస్తోంది కర్నూలు జిల్లా పరిషత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జడ్పీ సమావేశంలో సాగు,తాగు నీటి సమస్యలపై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నిరసన గళంతో నినదించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైయస్‌పీపీ నేతలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల దాడిలో వైయస్‌ఆర్‌సీపీ నేత బీవై రామయ్య సొమ్ముసిల్లి పోయారు. అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి సహా పలువురు వైయస్‌ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేశారు.