హైదరాబాద్: చంద్రబాబు ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వైయస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై సీఎం అవహేళనగా మాట్లాడారని తప్పుపట్టారు. హత్యాయత్నం ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ చంద్రబాబు ఏ కారణంతో తిరుగుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఏనాడు ఒంటరిగా పోటీ చేసి గెలవలేదని ఎద్దేవా చేశారు.