<strong>వైయస్‌ఆర్‌సీపీ నేత వైవి సుబ్బారెడ్డి</strong>తూర్పుగోదావరిః జిల్లాలో ప్రబలుతున్న డెంగీ జ్వరాలపై ప్రభుత్వం స్పందించాలని వైయస్‌ఆర్‌సీపీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పార్టీ సమావేశంలో పాల్గొన ఆయన పార్టీలోకి చేరిన నేతలకుS పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వైయస్ జగన్‌పై రూపొందించిన జనం గుండెల్లో సీడీని ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదన్నారు. విద్య,వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు.