వైయస్‌ జగన్‌ అత్యంత గౌరవం ఇచ్చారుఅమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు అత్యంత గౌరవం ఇచ్చారని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రాజ్యసభ అభ్యర్థిత్వానికి అమరావతిలోని అసెంబ్లీలో నామినేషన్‌ దాఖలు చేశారు.  3 సెట్ల నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు 40 ఏళ్లుగా   అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఏ పార్టీ వాళ్లు అయినా వైయ‌స్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రను చూస్తే ఆయన ఎంత గొప్ప నాయకుడో తెలుస్తుంద‌న్నారు.  దురదృష్టవశాత్తు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  చనిపోయారన్నారు. కానీ ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిని అందించార‌ని చెప్పారు. ఎన్నికష్టాలు ఎదురైనా వైయ‌స్‌ జగన్‌ ప్రజల కోసం ధృడంగా నిలబడ్డార‌ని తెలిపారు. 2019లో వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు.’ అని ఆయన ఆశాభావం వ్య‌క్తం చేశారు. వైయస్‌ జగన్‌ నాకు అత్యంత గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top