<strong>వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్.</strong>విజయవాడః పవన్ రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీసీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ పెట్టినప్పుడు పవన్ ఏమయ్యారని ప్రశ్నించారు. జగన్ పారిపోయే వ్యక్తి కాదు..పోరాడే శక్తి అని అన్నారు.ఫిరాయింపులపై పవన్‌కల్యాణ్ ఒక్కసారైనా మాట్లాడారా అని అన్నారు. ప్రశ్నించే పార్టీ అంటూ నాలుగేళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు.<br/>