అనంతపురం : అనంతపురంలో మంత్రి పరిటాల సునీత కుటుంబం అవినీతి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వైయస్ఆర్‌సీపీ నాయకుడుతోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సవాలు విసిరారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులు వందల కోట్ల అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రౌడీయిజం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పరిటాల వర్గీయులు వందల కోట్లు దోచేశారని, అవినీతి, అక్రమాలను బయటపెట్టిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ అనంతపురంలోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల వర్గీయులు ధర్నా చేయడాన్ని ప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిజాలు నిర్భయంగా తెలియజేసే సాక్షి మీడియాపై అనవసర రాద్ధాంతం చేయటం మంత్రి పరిటాల సునీతకు తగదన్నారు. అవినీతి, అక్రమాలను ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తున్న సాక్షి మీడియా పై అక్కసు వెళ్లగక్కటం మంత్రి పదవిలో ఉన్న పరిటాల సునీతకు తగదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.<br/>