– టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు– వైయస్‌ఆర్ కుటుంబంపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.– వైయస్ జగన్‌ను అంతమొందించాలని కుట్ర పన్నారు.– చంద్రబాబు దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నారు– చంద్రబాబు పునాదులే వెన్నుపోట్లు– ఎన్‌టీఆర్‌ను చంపి ముఖ్యమంత్రి అయిన చరిత్ర చంద్రబాబుది– కుట్ర రాజకీయాలనే నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు..అందులోంచి పుట్టిందే గరుడ ఆపరేషన్– నటుడు శివాజీని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు– శివాజీని విచారిస్తే నిజాలు బయటపడతాయని బాబుకు భయం– కేంద్ర సంస్థల విచారణతోనే నిజాలు బయటకు వస్తాయి– ఇంతవరకు అమరావతి రాజధాని కట్టలేకపోయారు– పోలవరం పూర్తి చేయలేకపోయారు– ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోయారు.
విజయవాడ: వైయస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయి అని ఆయన్ను విచారించాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండు చేశారు. గాయమైన వెంటనే చిరు నవ్వులు చిందించిన నాయకుడు వైయస్ జగన్ అని, మాకు డ్రామాలు తెలియవన్నారు. టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబే కుట్రదారుడని, అతనే ఏ1 ముద్దాయి అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మహానేత కుటుంబ సభ్యులపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని, ఇలాగే మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. సుధాకర్‌బాబు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సినీ నటుడు శివాజీ గరుడ పురాణం చెబితే ఎందుకు ఆయన్ను అరెస్టు చేయడం లేదని నిలదీశారు. నీతో నియమించిన ఆ పెయిడ్ ఆర్టీస్టును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పిన వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదన్నారు. శివాజీని విచారణ చేయిస్తే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయో అన్న భయం చంద్రబాబుకు ఉందన్నారు. హత్యాప్రయత్నం చేయించిన వ్యక్తే విచారణకు ఆదేశిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయని మండిపడ్డారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేక కేంద్రంలోని ఓ స్వతంత్య్ర సంస్థతో విచారణ చేయిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. వైయస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణకు తట్టుకోలేక ప్రజా సంకల్ప యాత్రను ఆపేందుకు జననేతపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు.– నిన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సోదరి షర్మిలపై చేసిన ఆరోపణలను సుధాకర్‌బాబు తీవ్రంగా ఖండించారు. ‘‘మిస్టర్ రాజేంద్రప్రసాద్..నీది నోరా.. నీ పిచ్చి కుక్క వాగుడు మానుకో’’ నీ గబ్బు నోరు కడగడానికి ప్రపంచంలోని అన్ని ఫినాయిల్ కంపెనీలు కూడా మన వద్ద అలాంటి మందు లేదే అని ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజేంద్రప్రసాద్..నీకు సిగ్గు లేదా అని నిలదీశారు. నీవు అనుకున్న కోణాన్ని కూడా విచారించే సత్తా ఈ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. రాజేంద్రప్రసాద్..నీ మాటలు వాజమ్మ మాటలు..దద్దమ్మ మాటలు, అటు ఇటు కానీ మాటలని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం గురించి మాట్లాడే ముందుకు ఒక్కసారి ఆలోచన చేయాలని హెచ్చరించారు. వారి కుటుంబ రాజకీయ ప్రయాణం త్యాగాల నుంచి పుట్టిందన్నారు. ఈ రోజు రాసిపెట్టుకో..2019లో వచ్చేది రాజన్న రాజ్యమే అని స్పష్టం చేశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని, నీవు చేసిన ప్రతి ప్రకటనకు నీవే జవాబుదారి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. వైయస్ జగన్‌పై హత్యాయత్నం చేయించింది విజయమ్మనా?, షర్మిలమ్మనా? అని ప్రశ్నించారు. ఈ ప్రపంచంలో ఉన్న బూతులన్నీ తిట్టినా కూడా నీకు సమానం కావని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఛీ..అని వదిలేశామన్నారు. ఇది టీడీపీ రాజకీయ నైతిక స్థాయి అని విమర్శించారు. ప్రజలారా..ఈ తెలుగు దేశం పార్టీ నేతలు అంటున్నారు..వైయస్ విజయమ్మ, షర్మిలమ్మ కలిసి వైయస్ జగన్‌పై హత్యాయత్నం చేయించారని ఆరోపణలు చేస్తున్నారని, ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. ఈ దుర్మార్గాన్ని ఆలోచించాలని కోరారు. స్వయంగా డీజీపీ వచ్చి ఇది పబ్లిసిటీ డ్రామా అన్నారని, సీఎం కుట్ర అంటున్నారని, మా కార్యకర్తలతో మేమే పొడిపించుకుంటున్నామని అంటున్నారని, ఇప్పుడేమో రాజేంద్రప్రసాద్ వచ్చి..విజయమ్మ, షర్మిలమ్మ కలిసి వైయస్ జగన్‌ను అడ్డు తొలగించుకుంటే సీఎం కావచ్చు అని ఆరోపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఘోరం జరుగుతుందని, దుర్మార్గం జరుగుతుందని అందరూ ఏకతాటిపైకి వచ్చి వైయస్ జగన్‌ను అడ్డుకోవాలన్నదే అధికార పార్టీ లక్ష్యంగా ఉందన్నారు. రాజేంద్ర ప్రసాద్..నీ పార్టీ కాంగ్రెస్‌తో కలిసినా, ఎవరితో కలిసినా, అందరూ జట్టు కలిసి వచ్చినా వైయస్ జగన్ సింగిల్‌గా సింహంలా వస్తారని పేర్కొన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా 2019లో వైయస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. ఇది ప్రజల నిర్ణయమని, టీడీపీకి బుద్ది చెప్పడానికి ప్రజలు నిర్ణయానికి వచ్చారని తెలిపారు. హంతకులు ఎలా ఉంటారో రాజేంద్రప్రసాద్..ఒక్కసారి మీ నాయకుడిని అడుగు అని సూచించారు. ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంపేస్తే ఎలా ఉంటారో అలా ఉంటారన్నారు. మల్లెల బాజ్జిని చంపేశారే, ఒక ఎస్సీ కు్రరాడిని హతమార్చారే అలా ఉంటుంది హత్యా రాజకీయమని గుర్తు చేశారు. పింగలి దశరథరామ్ అనే విలేకరి మీపై ఇన్వేస్టిగేషన్ చేసి సీఎం చంద్రబాబు తప్పును పట్టుకుంటే అతన్ని దారుణంగా హత్య చేయించాడే అలా ఉంటుంది హత్యా రాజకీయం అన్నారు. పేదల పెన్నిది, బడుగుల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగను చంపించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మా దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డిని కూడా ఇలాగే చంపేశారేమో అన్న అనుమానం కలుగుతుందున్నారు. మరింత లోతుగా విచారణ చేయించి ఉంటే నిజాలు బయటకు వచ్చేవన్నారు. గాయాలు అయ్యింది మాకు..మాపై హత్యాప్రయత్నం జరిగితే , వైయస్ జగన్‌పై కత్తివేటు పడితే మేం బాధపడాలి, మాకు కోపం రావాలి, మేం రోడ్డుపైకి రావాలి, మేం మీడియా ముందుకు రావాలి. కానీ టీడీపీ ఈ మూడు రోజుల్లో 40 సార్లు ప్రెస్‌మీట్లు పెట్టారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిది హత్యే అన్న అనుమానం కలుగుతుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటి చేస్తున్నాయంటే మా అనుమానాలు నివృత్తి అయ్యాయని పేర్కొన్నారు. మా కళ్లలో ఉన్న భ్రమలు తొలగిపోయాయని చెప్పారు. రాజేంద్రప్రసాద్‌ను అడుగుతున్నాం..నీ టీడీపీ ఇంకా అధికారంలో ఉండేది మూడు నెలలే అని, కనీసం నీ బు్రరను ఉపయోగించి విచారణ జరిపించు నిజాలు బయటకు వస్తాయన్నారు. నీవు డీజీపీ, ముఖ్యమంత్రిని దమ్ముంటే అడుగు అని సవాలు విసిరారు. ఎలా నోరెచ్చింది నీకు అని హెచ్చరించారు. అన్నపై అంతులేని అభిమానంతో ఓ ఆడబిడ్డ 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళగా షర్మిలమ్మ చేసిన పాదయాత్రను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. అన్న వదిలిన బాణం అని చెప్పిన గొప్ప వ్యక్తి షర్మిలమ్మ అని గుర్తు చేశారు. అలాంటి సోదరి గురించి మాట్లాడుతావా అని ప్రశ్నించారు. కోడుకుపై కొండంత ప్రేమతో రాజన్న రాజ్యం తెస్తాడని, మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో మరోమారు తెచ్చేది కేవలం వైయస్ జగన్ అని నమ్మిన తల్లి అని, తన బిడ్డ కోసం రోజు ప్రార్థన చేస్తున్న విజయమ్మ గురించి మాట్లాడుతావా అని ప్రశ్నించారు. అలాంటి తల్లిపై నిందలు వేస్తావా అని మండిపడ్డారు. రాజేంద్ర ప్రసాద్..నీ నాలుక చీరేస్తామని హెచ్చరించారు. నీ బట్టలు ఊడదీసి కొట్టే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. రాజేంద్ర ప్రసాద్ రెండు కళ్లకు ఆపరేషన్ చేయించుకో అని హితవు పలికారు. ఒక్క కంటితో చూస్తే నీకు అలాగే కనబడుతుందని, రెండో కన్ను కూడా బాగు చేయించుకో అని సలహా ఇచ్చారు. వైయస్ జగన్‌పై జరిగిన కుట్రను బయట పెట్టమని మా ఎంపీలు దేశ రాజధానిలో అడుగుతున్నారని, కేంద్ర స్థాయి విచారణ సంస్థతో విచారణ చేయించాలని, ఏ1 ముద్దాయి చంద్రబాబును సీఎం పదవి నుంచి దించి వేయాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని, గరుడ పురాణం ప్రకటన కర్త శివాజీని తక్షణమే అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చి అరెస్టు చేయాలని డిమాండు చేశారు.