అలుపెరగని అవిశ్రాంత యోధుడు వైయస్‌ జగన్‌..

శ్రీకాకుళంఃప్రజల కోసం మహానేత తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  అలుపెరగని పోరాటం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించడానికి ఉద్యమస్ఫూర్తితో జననేత కదులుతున్నారన్నారు.ప్రతిపక్ష పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలను పశువులను కొనట్లు కొని అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. శాసన సభలో మాట్లాడదామంటే కనీసం మైక్‌ కూడా ఇవ్వరని మండిపడ్డారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయండి అని కోరితే  పట్టించుకోకుండా  ఏపీ శాసన సభ స్పీకర్‌ రాజ్యాంగ వ్యవస్థను మంటకలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నలుగురికి మంత్రులు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ప్రతిపక్షపార్టీలో ఉంటే డబ్బులు రావని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరి దోపిడీ వ్యవస్థకు తలుపు తెరిచారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు దొరికింది దొరికినట్టుగా సహ సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు  వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, న్యాయం కోసం ఏ పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళిన ఏ పార్టీకి చెందినవారని అడుగుతున్నారని మండిపడ్డారు.  ఏపీ ప్రభుత్వం అవినీతిపై పోరాడుతున్న అవిశ్రాంత సమరయోధుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు.  పక్క రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వచ్చాయో చూశారని అవినీతి పాలన ఎంతో కాలం  సాగదన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని తుదిముట్టిæంచే చర్యలకు ఏపీ ప్రజలు శ్రీకారం చుట్టబోతున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top