ఆర్థిక నేరాల్లో అసలు సిసలైన దొంగ చంద్రబాబే

శ్రీకాకుళం: ఏపీ ఆర్థిక నేరాల్లో అసలు సిసలైన గజదొంగ చంద్రబాబేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. టీడీపీ ఎంపీ, ఆర్థిక నేరగాడు సుజనా చౌదరి మీద ఇప్పటికే చర్యలు తీసుకుని ఉండాల్సిందని, కేంద్ర మంత్రిని చేసి కాపాడటం వల్లనే వేల కోట్ల రూపాయల అవినీతికి ఎగబాకాడన్నారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. సుజానా చౌదరి ఆర్థిక నేరాలు చేసి ఆ డబ్బును చంద్రబాబుకు అందజేశారని ఆరోపించారు. ఆ డబ్బుతోనే గత ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టి ఓట్లు కొన్నారన్నారు. ఆర్థిక నేరగాళ్ల మీద ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు  ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆర్థిక నేరాల మూలాలన్నీ చంద్రబాబు వద్దకే చేరతాయని, అందుకే జంకుతున్నాడన్నారు. ఆర్థిక నేరాలు బయటపడతాయనే కారణంతోనే ముందస్తుగా జాతీయ పార్టీ అండ కోసం కాంగ్రెస్‌ పంచన చేరారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌ పేరిట పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెడుతున్నారని మండిపడ్డారు. పసిపిల్లలకు కూడా ఉగ్గుపాలతో అవినీతి నేర్పుతున్నారని ధ్వజమెత్తారు. రెండు వేల రూపాయల నోట్లు కూడా రద్దు చేస్తే, వచ్చే ఎన్నికల్లో అవినీతి సొమ్ము కట్టడి అవుతుందన్నారు.  
 
Back to Top