ప్రజా ఉద్యమానికి నాందే ప్రజా సంకల్ప యాత్ర

– ప్రజల కోసమే వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర
– నిరుద్యోగ యువతకు ఉపాధి
– రైతన్నలకు పండగ చేయాలన్న సంకల్పం
– ప్రజలే రక్షణ కవచంగా ప్రజా సంకల్ప యాత్ర
– నాలుగున్నరేళ్లు ప్రజలు చీకట్లో గడిపారు
– టీడీపీ కేబినెట్‌లో ఓ దొంగల ముఠా
– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సంతతో పశువు మాదిరి కొనుగోలు
శ్రీకాకుళం:  ప్రజా ఉద్యమానికి నాందే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. చీకటి యుగం నుంచి వెలుగులోకి రావాలంటే మీ అండదండలు నాకివ్వండని వైయస్‌ జగన్‌ పాదయాత్రతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం నగరంలో తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర భారత దేశ రాజకీయా చరిత్రలో అపూర్వ ఘట్టమని తెలిపారు. ప్రజలు నీరాజనాలు పలికి, స్వాగతం చెబుతున్న ఈ ప్రజా సంకల్ప యాత్ర దేశంలోని అన్ని చరిత్రలను తిరిగి రాసిందన్నారు. వైయస్‌ జగన్‌ తన కుటుంబానికి దూరంగా, ప్రజలే నాకు దేవుళ్లు, తల్లిదండ్రులు అంటూ రాత్రనక, పగలనకా పాదయాత్ర చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు.  యాత్ర ప్రారంభం రోజున వైయస్‌ జగన్‌ తన లక్ష్యాలను విషదీకరించారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని, నిరుద్యోగులకు ఉపాధి అవసరమని, మద్యం మాని ప్రతి ఇంటా ప్రేమలు నిండాలన్నదే జననేత సంకల్పమన్నారు. రైతన్నలు వ్యవసాయం పండుగ చేయాలన్నదే జగన్‌ లక్ష్యమన్నారు. ప్రతి నిరుపేద గుండెల్లో నిలిచిపోవాలన్న సంకల్పంతో ప్రతి ఇంటా నవరత్నాలతో వెలుగులు నింపాలని, ఆనందం పండాలని కోరుకుంటూ నవరత్నాల్లో మార్పులు, చేర్పులు మీరే చేయాలంటూ ప్రజలకు విజ్ఞాప్తి చేస్తూ ఆ మహానేత ఆశీస్సులతో ఈనాడు ప్రజలే రక్షణ కవచంగా ఈ యాత్ర కొనసాగుతోందన్నారు. ఈ నారసుర పాలనలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేసుకుంటూ ఎక్కడికి వెళ్లినా ప్రజల  ఇబ్బందులు, కన్నీళ్లు కనిపించాయన్నారు. ఈ రోజు ఏ జిల్లా చూసినా, ఏ మండలం, గ్రామం చూసినా, ఏ సామాజిక వర్గాన్ని తట్టినా తెలుగు వారి చరిత్రలో ఇంత దయనీయమైన రక్షణ పాలన ఎప్పుడు చూడలేదన్నారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నో ఘోరాలు చూశామన్నారు. ఇది  ఒక చీకటి యుగమన్నారు. చంద్రబాబు పాలన అంతా కూడా రక్త చరిత్రే అని విమర్శించారు. చివరకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం దాకా ఈ పాలన కొనసాగుతూనే ఉందన్నారు. శాసన సభలో ఈనాడు ఉన్నది  దొంగల ముఠాగా మారిన కేబినెట్‌ ఉందని విమర్శించారు. అలీబాబా 40 మంది దొంగల మాదిరిగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారన్నారు. గ్రామాలను తినేస్తున్న ఎల్లో వైరస్, అదే అభివృద్ధి అంటూ చూపించే ఎల్లో మీడియా వ్యవహరించడం దురదుష్టకరమన్నారు. రాష్ట్రంలో ఆస్తులు తగ్గాయని, అప్పుల నిప్పుల్లో ఈనాడు రాష్ట్రం తగులబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం ప్రతి ఇంటా ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు. ఏ ఒక్కరి భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. లంచం తారాస్థాయికి చేరిందన్నారు. లంచంలో ఏపీ ప్రభుత్వం జాతీయ అవార్డు పొందుతోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి పాలన నుంచి విముక్తి కల్పించేందుకు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో అడుగు ముందుకు వేశారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో, శాసనసభలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే అని మండిపడ్డారు. ఎక్కడా కూడా న్యాయం, ధర్మం, ఒక పద్ధతి లేదన్నారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు తన అవినీతి సొమ్ముతో సంతలో పశువుల్లాగా కోట్లు కుమ్మరించి కొనుగోలు చేశారన్నారు. ఇలాంటి పరిస్థితి నివారించాలని కోరితే శాసన సభలో మైక్‌ కూడా ఇవ్వకుండా లాక్కున్నారన్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తి చట్టాలను తుంగలో తొక్కి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను పవిత్రమైన శాసన సభలో కొనసాగించడం దారుణమన్నారు. అప్రజాస్వామ్యంగా శాసన సభను నడిపించారని, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరినా పట్టించుకునే నాథుడు లేడన్నారు. త్వరలోనే చీకటి పాలనకు ప్రజలు చరమ గీతం పాడనున్నారని, వచ్చేది రాజన్న రాజ్యమే అని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
Back to Top