<strong>గిరిజనులను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త రెడ్డి శాంతి</strong>శ్రీకాకుళంః గిరిజనులు అధ్వాన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని పాతపట్నం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు.కనీస విద్య,వైద్య,రహదారుల సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం లేదన్నారు.టీడీపీ ప్రభుత్వం గత నాలున్నరేళ్లుగా ఒక అభివృద్ధి పని కూడా చేయలేదని మండిపడ్డారు.గిరిజనులు అభివృద్ధికి నోచుకోకుండా అంధకారంలో జీవిస్తున్నారని తెలిపారు.గతంలో వైయస్‌ఆర్ హయాంలో 150 పంచాయతీలకు తాగునీరు, వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రారంభించారని, వైయస్‌ఆర్ మరణానంతరం ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయన్నారు.మంత్రి అచ్చెంన్నాయుడు,ఎంపీ రామ్మోహన్‌నాయుడు,కళా వెంకట్రావ్‌లు సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు.కేవలం ప్రచార్భాటం తప్ప అభివృద్ధి జరగడం లేదన్నారు.దివంగతం మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని,అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. అదే నమ్మకం ప్రజలకు వైయస్ జగన్‌పై ఉందని, జననేత అధికారంలోకి వస్తే మళ్లీ సంక్షేమ రాజ్యం వస్తుందని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు.